Monday, 16 April 2012

కలరా - Cholera

చికిత్స


మొదటి పద్ధతి:

కురాసాని వామును(Hyoscyamus niger, L.) కాల్చి బూడిద చేసి దానికి అంతే పరిమాణంలో పంచదార కలిపి ఉంచుకోవాలి. పవుతులం (3 గ్రాములు) మోతాదు చొప్పున ఆ చూర్ణమును గంటకొకసారి సేవిస్తూ వుంటే కలరా వ్యాధి అద్భుతంగా తగ్గిపోతుంది.

రెండవ పద్ధతి:

కలరా వ్యాధి వచ్చినప్పుడు నిమ్మకాయల రసము(Lemon Juice - Citrus medica var. acidica watt.) 30 మి.లీ, నుండి 60 మి.లీ. మోతాదులో (1 నుండి 2 ఔన్సులు) తాగిస్తూ ఉండాలి.

మూడవ పద్ధతి:

ప్రతిరోజూ భోజనముతో పాటు రెండు నిమ్మకాయల రసము(Lemon Juice - Citrus medica var. acidica watt.) త్రాగుతూ ఉంటే కలరా వ్యాధిని రాకుండా నివారించవచ్చు.

నాల్గవ పద్ధతి:

చనుబాలతో మంచిగంధము(Santalum album L.) కలిపి నాలుగు నుండి ఐదు చుక్కలు ముక్కులో వేస్తూఉంటే కలరాలో వచ్చు ఎక్కిళ్ళ నుండి ఉపశమనం పొందవచ్చు.

కడుపులొ విషపునీరు పెరుగుట ( జలోదరము) - Abdominal dropsy or Ascites

చికిత్స


మొదటి పద్ధతి:

పిప్పళ్ళు(Piper longum Linn.) ఒక తులము (12 గ్రాములు) మరియు సైంధవలవణము పావు తులము (3 గ్రాములు), తియ్యటి మజ్జిగ పావులీటరు(250 ml) కలిపి ప్రతిరోజూ ఉదయము ఒక మోతాదుగా సేవించాలి. ఈ విధంగా ఒక నెల రోజులు చేసిన జలోదరము హరించును.

కడుపులో నల్లబద్ద పెరుగుట ( ప్లీహోదరము) - Spleen Enlargement

చికిత్స


మొదటి పద్ధతి:

బాగా మగ్గిన మామిడి పండ్ల(Mango - Mangifera indica L.) రసములో కొంచెం తేనె కలుపుకొని త్రాగుతూ ఉన్నచో ప్లీహోదరము హరిస్తుంది.

ఋతుశూల (బహిష్టు నొప్పి) - Menstrual Pain

చికిత్స


మొదటి పద్ధతి:

చెంగల్వ కోష్టు వేళ్ళను నాలుగు రెట్ల నీటిలో వేసి మరగబెట్టాలి, సగం కషాయము మిగిలేంతవరకు కాచి వడగట్టాలి. ఆ ద్రవాన్ని ౪ నుంచి ౫ చుక్కలు చెవులలో వేస్తే ముట్టునొప్పి హరిస్తుంది.

కడుపుబ్బరము - Gas or Flatulence

చికిత్స


మొదటి పద్ధతి:

ఒక గ్రాము సైంధవలవణము(Rock Salt) ఐదు గ్రాముల అల్లము(Ginger - Zingiber Officinale Roscoe) కలిపి ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం సేవిస్తూఉంటే కడుపుబ్బరము నుండి ఉపశమనం పొందవచ్చు.

ఎక్కిళ్ళు - Hiccups

చికిత్స


మొదటి పద్ధతి:

వండిన ఆముదంలో(Castor Oil - Ricinus Communis L.) కొంచెం పసుపుతో చేసిన కుంకుమ కలిపి నాలుకకురాసినచో ఎక్కిళ్ళు ఆగును.

ఉబ్బసము - Asthma

చికిత్స


మొదటి పద్ధతి:

చక్కెరకేళీ అరటిపండును కొద్దిగా గోమూత్రంలో కలిపి తాగిస్తే ఉబ్బసవేగము నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

రెండవ పద్ధతి:

పరిశుద్ధమైన వేపనూనె(Neem oil - Seed oil of Melia azadirachta,L.) 5 నుండి 10 చుక్కలు తమలపాకులో(Beetle Leaves) వేసుకొని వారము రోజుల పాటు రోజూ ఒకటి నుండి రెండు సార్లు తింటూఉంటే వారం రోజుల్లో ఉబ్బసము తగ్గిపోతుంది.

మూడవ పద్ధతి:

కుంకుడు గింజలోని(Sapindus emarginatus Vahl.) పప్పు ప్రతిదినం తింటూఉంటే ఉబ్బసవ్యాధిని నివారించవచ్చు.

నాల్గవ పద్ధతి:

నిత్యం పరగడుపున కాఫీ కషాయము(Black coffee) లేక టీ(Tea) తాగుతూఉంటే ఉబ్బసము హరిస్తుంది.

ఐదవ పద్ధతి:

పచ్చి జిల్లేడు పువ్వులు(Calotropis gigantea (L.)(R.Br.)), సమానంగా నల్ల మిరియాలు(Black pepper - Piper nigrum L.) కలిపి మెత్తగా నూరి మూడు గురిగింజల పరిమాణంలొ(400 mg) మాత్రలుగా చేసి ఎండించాలి. అలా తయారుచేసిన మాత్రలను పూటకొక మాత్ర చెప్పున ఉదయం మరియు సాయంత్రం సేవించాలి, అలా చేస్తే ఉబ్బసము నిస్సందేహంగా నశిస్తుంది.