Thursday, 16 February 2012

ఆకలి తగ్గిపోవుట - Loss of Appetite

ఆకలి తగ్గిపోవుట

చికిత్స

మొదటి పద్ధతి:

నేలతాడిగడ్డల(Curculigo orchioides Caertn) చూర్ణము, శొంఠి(Dry ginger - Zingiber Officinale Roscoe) చూర్ణములను రెండూ సమాన భాగాలుగా కలిపి పూటకు 2 గ్రాముల చొప్పున వేడినీళ్ళ అనుపానముతో రోజుకు రెండుపూటలా సేవించవలెను.

అరుచి - Anorexia

అరుచి

చికిత్స

మొదటి పద్ధతి:

ఉప్పు మరియు అల్లము(Ginger - Zingiber Officinale Roscoe) కలిపి ప్రతిరోజూ అన్నం తినేముందు తీసుకోవాలి.

రెండవ పద్ధతి:

ఎండు ద్రాక్ష పండ్లు(Dry grapes(Raisins) - Vitis vinifera L.) కరక్కాయ(Terminalia chebula Retz.) మరియు కండ శక్కర సమాన భాగములుగా తీసుకొని మెత్తగా దంచి పొడిచేసి ఉంచుకోవాలి.రోజులో రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళతో 2 నుండి 4 గ్రాముల పొడిని సేవిస్తూ ఉంటే నోటిలో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగును.

అర్శ మొలలు - Piles

అర్శ మొలలు

అర్శస్సు లేదా అర్శ మొలలు లేదా మొలల వ్యాధి

చికిత్స

మొదటి పద్ధతి:

ఆవు వెన్న మరియు నువ్వులు(Sesamum indicum L.) సమానముగా కలిపి ఒక వారంరోజుల పాటు ప్రతిరొజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే మూల వ్యాధి తగ్గుతుంది.

రెండవ పద్ధతి:

ఒక టీ స్పూను ఆవు నెయ్యిని, ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి ప్రతినిత్యం త్రాగుతూ ఉంటే మొలలు ఊడి పడిపోవును.

అతిదాహము - Excessive Thirst

అతిదాహము

చికిత్స

మొదటి పద్ధతి:

కొన్ని చలువ మిరియాలను(Piper cubeba L.f.) నోటిలో వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఎన్ని నీళ్ళు తాగినా తీరని దప్పిక (దాహం) తగ్గిపోతుంది.

రెండవ పద్ధతి:

కొద్దిగా ధనియాలను(Coriander - Coriandum sativum L.) తీసుకుని కషాయముగా కాచి, 20 నుండి 30 మీ.లీ. కషాయములో తగినంత పంచదార కలుపుకొని తాగుతూ ఉంటే విపరీతమైన దాహము హరించిపోతుంది.

Wednesday, 15 February 2012

అజీర్ణము - Indigestion

అజీర్ణము

చికిత్స

మొదటి పద్ధతి:

కరక్కాయ(Terminalia chebula Retz.) చూర్ణము, సైంధవలవణము సమాన భాగాములుగా కలుపుకొని పూటకు పావు తులము (3 గ్రాములు) ఉదయము మరియు సాయంత్రము భోజనము తరువాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగముల నుండి  ఉపశమనం పొందవచ్చు.

రెండవ పద్ధతి:

పచ్చి అరటికాయను(Green banana - Musa paradisiaca L.) ముక్కలుగా కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 రెండు గ్రాములు పొడిని కొద్దిగా ఉప్పు కలిపి సేవించిన అజీర్ణమును, మరియు పులిత్రేన్పులు గల అగ్నిమాంద్యమును హరింపచేస్తుంది.